Header Banner

పవన్ కు జనసేన శ్రేణుల ఘన స్వాగతం.. తిలకంతో ఎంట్రీ ఇచ్చిన జననాయకుడు! 90 నిమిషాల హోరాహోరీ ప్రసంగం!

  Fri Mar 14, 2025 21:14        Politics

జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ బహిరంగసభ వేదికగా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం ఇదే కావడంతో.. ప్రాధాన్యత ఏర్పడింది.. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, విజయాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు.. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కల్యాణ్………

14 Mar 2025 07:35 PM (IST)
ఆవిర్భావ సభకు చేరుకున్న పవన్ కల్యాణ్
పిఠాపురంలో జరుగుతున్న 12వ ఆవిర్భావ సభకు అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు అందరూ మాట్లాడారు. ఇక పవన్ రాకతో సంబురాలు ఆకాశాన్ని అంటాయి. పవన్ నుదిటన తిలకంతో ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.

14 Mar 2025 07:18 PM (IST)
నా ఆస్తులు జగన్ కాజేశాడుః బాలినేని శ్రీనివాస్ రెడ్డి
పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులను మాజీ సీఎం జగన్ కాజేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబాన్ని జగన్ చాలా ఇబ్బంది పెట్టారని.. అందుకు చాలా బాధపడ్డట్టు చెప్పుకొచ్చారు. తనకు పవన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారని.. పదవి వచ్చినా రాకపోయినా జనసేనలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.

14 Mar 2025 07:16 PM (IST)
జగన్ నాకు తీవ్ర అన్యాయం చేశాడు: మాజీ మంత్రి బాలినేని
మాజీ సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మంత్రి పదవి తీసేశాడని.. అయినా సరే తాను బాధపడలేదన్నారు. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ వెంట తాను నడుస్తానని.. ఎలాంటి పదవులు ఆశించి జనసేనలోకి రాలేదన్నారు. జనసేన కోసం ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తానని వివరించారు. 14

Mar 2025 06:43 PM (IST)
పవన్ కల్యాణ్ స్థాయికి నేను ఎదగలేనుః నాగబాబు
పవన్ కల్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని నాగబాబు ప్రశంసించారు. 'అతను చాలా ఎత్తుకు ఎదిగాడని.. వీలైతే పవన్ కల్యాణ్ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి. లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలి. నేను పవన్ అంత ఎత్తుకు ఎదగలేను. అందుకే సేవకుడిగా ఉండిపోయాను' అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

14 Mar 2025 06:41 PM (IST)
పవన్ గెలుపు ఒక వ్యక్తి వల్ల రాలేదుః నాగబాబు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు జనసేన కార్యకర్తలు, ప్రజలు కీలకంగా పనిచేశారన్నారు. అంతే తప్ప ఎవరో ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదన్నారు. అలా తన వల్లే పవన్ గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


14 Mar 2025 06:37 PM (IST)
జగన్ ఇంకో 20ఏళ్లు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: నాగబాబు
జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ వైసీపీపై సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు మాజీ సీఎం జగన్ నిద్రలోకి వెళ్లిపోయారని.. ఇంకా ఆ నిద్ర నుంచి బయటకు రాలేదని చెప్పారు. అప్పుడప్పుడు ఆయన మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జగన్ ఇంకో 20 ఏళ్లు నువ్వు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ సెటైర్లు వేశారు.

14 Mar 2025 06:34 PM (IST)
12వ ఆవిర్భావ దినోత్సవం పుష్కరాల లాంటిదిః నాగబాబు
మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.

14 Mar 2025 06:11 PM (IST)
పవన్ కు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుః పురంధేశ్వరి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, జనసేన నేతలకు స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.

14 Mar 2025 05:58 PM (IST)
పిఠాపురం చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభకు ఆయన మరికొద్ది సేపట్లో వెళ్తారు. హెలికాప్టర్ ద్వారా ఆయన పిఠాపురం వెళ్లారు. సభకు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు.

14 Mar 2025 05:42 PM (IST)
జ్యోతి ప్రజ్వలన చేసిన వీరమహిళలు
పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రాజావారి ద్వారం నుంచి వచ్చిన వీరమహిళలను ముందుగా స్టేజి మీదకు ఆహ్వానించారు. వారితో జ్యోతి ప్రజ్వలన చేయించి సభను ప్రారంభించారు. అనంతరం వారంతా జై జనసేన నినాదాలు చేశారు. అనంతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

14 Mar 2025 05:04 PM (IST)
జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుః చంద్రబాబు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. జనసేన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా అభినందించారు. పవన్ తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు.

14 Mar 2025 04:23 PM (IST)
పిఠాపురం జనసేన సభ వద్ద ఉద్రిక్తత
పిఠాపురం జనసేన సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని రాజావారి ద్వారం నుంచి వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ ఎమ్మెల్యే, అతని అనుచరులు లోపలకు వెళ్లారు.

14 Mar 2025 03:43 PM (IST)
90 నిముషాల పాటు పవన్ స్పీచ్
పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ 90 నిముషాల పాటు మాట్లాడుతారు. ఇందులో 12 ఏళ్లుగా జనసేన చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు.

14 Mar 2025 03:11 PM (IST)
జనసేన ఆవిర్భావ సభకు మూడు ద్వారాలు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లడానికి మూడు ద్వారాలు.. పిఠాపురం రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలు పాస్లకు ఎంట్రీ.. డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీ, వీవీఐపీ పాస్లకు.. మల్లాడి సత్యలింగం నాయకర్ ద్వారం నుంచి జనసేన కార్యకర్తలకు ఎంట్రీ కావాల్సి ఉంటుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #janasena #pawankalyan #jayakethana #todaynews #flashnews #latestnews